కలిస్తే ; --డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అక్షరాలు కలిస్తేనె
వస్తుంది భావం
పూవులన్ని కలిస్తేనె
అవుతుంది హారం
పరకలన్ని కలిస్తేనె
అమరుతుంది దారం 
మనుషులంత కలిస్తేనె
అవుతుంది దేశం
కులమతాలు కలిస్తేనె 
దేశానికి లాభం 
పిల్లలంత కలిస్తేనె 
జగతికే అందం !!

కామెంట్‌లు