నాకిష్టం ; -- ఎం. వి. ఉమాదేవి -కవితా భూషణ్. నెల్లూరు
గులాబీ పూలంటే నాకిష్టం 
కొనాలీ రోజంటే మాకష్టం 
సవాలే చేస్తున్నదో కష్టం 
మొక్కలే నాటాకలేదు నష్టం !
గుత్తులుగా పూసేనే  రోజాలుమా !!

రమణి కురుల నవ్వె గులాబీ 
సుమాలలో తాను నవాబీ 
వనాలకే గొప్ప షరాబీ 
జనాలలో మహా జవాబీ !!
సోయగం రంజిల్లగా ఉమా!

పసిడినవ్వు పసి గులాబీ 
మిసిమిదవ్వు విడిగులాబీ 
విసుగులేని కసి గులాబీ 
వ్యసనమైన జత గులాబీ !!
గుట్టలలోనా  పూసే ఉమా !!

ముల్లుగుచ్చిన రాలుకన్నీరు 
జల్లులందు పడే వాననీరు 
వేలరేకుల పిండి పన్నీరు 
పూలదారులు వదలిరానీరు
తోటమాలికి కష్టమేఉమా !!

కామెంట్‌లు