గుణింత గేయం;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
జ లజల యేరు పారెను
జా బిలి నింగిని వెలిసెను
జి లిబిలి పలుకుల చిలుక
జీ విత విలువను తెలిపెను

జు న్నును  అమ్మ పెట్టెను
జూ దము వద్దని చెప్పెను
జృ తో పదం వ్రాసెను
జౄ కు అర్ధం నుడివెను

జె మిని టీవీ చూపింది
జే జి కూడా వచ్చింది
జై ! జై ! లు పలికింది
జొ న్న రొట్టెను ఇచ్చింది

జో ల పాట పాడింది
జౌ ళి సంచి విప్పింది
జం ట మామిడి కోసింది
 జః గుణింతం నేర్పింది


కామెంట్‌లు