*అవసరం ;-ఎం. వి. ఉమాదేవి
ఆట వెలదులు 
=============
చట్టమొకటి యున్న చాలమంచిది గాదె 
నేరమదుపు జేయ నేర్పుగాను 
చట్టభయముతోడ జరుగవు మోసముల్ 
కొంతయదుపు గల్గు సుంత బెదురు !!

హింసలదుపు జేయ హితమైన చట్టము 
న్యాయమడుగుటకు న న్యాయపరులు 
తిమ్మి బమ్మి జేసి తిప్పలు బెడుదురు 
లొసుగులున్న వెన్నొ లోకమందు !!

నేరగాణ్ణి రక్ష

నేలజేయవలెను 
శిక్షననుభవించ శీఘ్రముగను 
మరలజేయుటకును మదిలోన భీతిల్లు 
చట్టలాభమిదియె చక్కగాను !!

ఎంత వారలైన నెటువంటి నేరము
చేసియుండగాను చెంపపగులు
చేతబేడి పడిన  చెల్లదు ముఖమింక 
పరువుపోయి వారు పరితపించు !!
కామెంట్‌లు