హాయి ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
పొద్దుపొద్దునా లేచేసీ
చద్దన్నాలూ తినేసీ
చొక్కాలాగూ ఉతికేసీ 
చిరుగులు అన్నీ కుట్టేసీ 
చెంబిస్త్రీ చేసేసీ 
బాలలందరిని పోగేసీ
చదువులు అన్నీ చదివేసీ
ఆటలు అన్నీ ఆడేసీ
పాటలు అన్నీ పాడేసీ
హాయిహాయిగా గడిపేద్దాం !!


కామెంట్‌లు