అభ్యాసం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అభ్యాసం కూసువిద్య అన్నారు. అనగననగ రాగమతిశయిల్లుచునుండు..తినగతినగ వేము తీయనుండు అనిఅందరికీ తెలుసు. ఆరోజు రోహిత్ అమ్మతో గుడికి వెళ్లాడు.ఒకామె హనుమ గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తను తెచ్చిన  భరిణలోని వక్క ను గట్టు పై పెడుతోంది. ఇంకో వ్యక్తి ప్రదక్షిణం చేయగానే ఒక పువ్వు తీసి పళ్లెంలో పెడుతున్నాడు."వాళ్ళు  ఎందుకు అలా లెక్క పెడుతున్నారమ్మా?" కుతూహలంగా రోహిత్ అడిగాడు. "తాము మొక్కుకున్న విధంగా ఎన్ని సార్లు తిరిగారో గుర్తుగా!" అమ్మ జవాబు ఇచ్చింది."ఓహో!మాటీచరు తప్పులు పోతే 5సార్లు ఇంపోజిషన్ రాయిస్తుంది."సాలోచనగా అన్నాడు రోహిత్!"ఊరికే గుడ్డెద్దు చేలో పడినట్టు రాయకూడదు. నోటితో ఆపదాన్ని ఉచ్చరిస్తూ రాస్తే అది బుర్రలో శాశ్వతంగా ఉండిపోతుంది.మాక్లాస్లో ఓపిల్లకి ఇంటివాతావరణం అమ్మా నాన్నల కొట్లాట వల్ల సరిగ్గా చదవలేక పోయేది. మాఇంట్లో ఆమెతో కలిసి నేను  కంబైన్డ్ స్టడీ చేసేదాన్ని. దానివల్ల నాకు ప్రశ్న జవాబు లు తేలిగ్గా వచ్చేవి.ఆపిల్ల కూడా  నోటితో స్పెల్లింగ్ అంటూ చదవటంవల్ల  తప్పులు  తగ్గాయి. తెలుగు కూడా అంతే! టీచర్ బోర్డు మీద రాసినవి నోటితో అంటూ రాస్తే  వత్తులు ఉచ్చారణ తో త్వరగా నేర్చుకోగలం!" "అమ్మా!మాక్లాస్ లో పిల్లలు పెద్దగా చదువుతూ రాయకూడదు. "రైట్ అండ్ రీడ్ సైలెంట్లీ!" అంటారు. క్లాస్ గందరగోళంగా ఉంటుంది అని టీచర్ అభిప్రాయం!పైగా పక్కనున్న క్లాస్ లకి చిరాకు.వారి టీచర్ చెప్పేది  వినపడదు అని  హెచ్.ఎం.హెచ్చరికలు!" తల్లి  మనసు లో నే అనుకుంది"పూర్వం  గురుకులాల్లో అంతా కంఠోపాఠం!నేడు ప్రతిదీ గూగుల్ లో చూడటం! నోటితో అనరు.హు..అధ్వాన్నపు చదువులు!"అని నిట్టూర్పు విడిచింది అమ్మ 🌷
కామెంట్‌లు
Yalamarthy Anuradha చెప్పారు…
అవును