పంచాక్షరునకు.... పంచ రత్న మాలిక . !;-- కోరాడ నరసింహా రావు.
నాగు ల  ధరించినవాడు 
  గంగను  భరించినాడు 
    విషదరు డాతడు 
      విశ్వంబరుడు.... !

నాద బ్రహ్మంబాతడు 
   సంగీతానికి ఆద్యుడు 
     సాహిత్య స్వరూపుడితడు 
        సర్వేశ్వరుడు.... !

నాట్య ప్రియుఁడీతడు 
  నంది వాహనుండు 
     హిమ నగ నివాసి ఈతడు 
       గిరిజనె  పెండ్లాడి నాడు !

గరళ కంఠము వాడు 
   ఫాల నేతృ డీతడు 
      పునః

సృష్ఠి కొరకీతడు  
         లయకరు  డైనాడు.. !!

వివిధ ప్రాంతములందు 
   వివిధ నామములతో 
     లింగరూపుడైపూజలంది                             
మనల బ్రోచు చున్నాడు !
        🙏💐🙏🌷🙏
   ********
కామెంట్‌లు