సేవ ఏ కొంచమైనచాలు; -కవి:సాహితీసింధు సరళగున్నాల
ఆ.వె*స్వార్థమింతగొనక, సంతోషభావమ్ము
విడక, దానమిడిన వేలధనము
లట్టు చేయుచున్న నానందజలధిలో
మునగవచ్చు నదియె మోక్షమిచ్చు

ఆ.వె*ఒడ్డుజేర్చ గుహుడు నోడపై రామున్ని
భక్తితోడ నంపెపరముడయ్యి
సాయమనునదింత, సఖ్యతన్ జూపగ
పుణ్యమబ్బు పరమ పురుషులకును

ఆ.వె*రావణవధ కొరకు రమ్యదారులకయ్యి
జలధి పైన సేతు సరళిగనుచు
నుడుతజేసె సాయ మున్నతంబైనిల్చె
యింతకన్ననేది సంతసమ్ము

ఆ.వె*లేనివారికింత లేశమాత్రంబైన
నిడిన నాస్తులేమి బడుగుబడవు
దానధర్మ మదియె ధన్యంబుజేకూర్చు
నీకు నీవె గొప్ప నెదురులేక

కామెంట్‌లు