రక్ష-శిక్ష ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 క్రమశిక్షణ క్రమశిక్షణ
మనమంతా పాటించాలి
చక్కని క్రమశిక్షణ 
ప్రకృతి పాటిస్తున్నది
కాలం పాటిస్తున్నది 
రోజులు వారాలు మాసాలు
ఋతువులు అన్నీ పాటిస్తున్నవి
గ్రహములు అన్నీ గతి తప్పక
క్రమశిక్షణ పాటిస్తున్నవి
క్రమశిక్షణ మనకు రక్ష
క్రమశిక్షణ లేకపోతే
మనకు పడును శిక్ష !!

కామెంట్‌లు