సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
  దొరకదు...దాగదు...
*******
ఎండమావుల్లో ఎంత వెదికినా  నీరు దొరకదు. కొందరు ఎండమావుల్లాంటి   హృదయాల్లో కూడా అంతే. కాగడా పెట్టి వెదికినా మంచితనం, మానవీయ విలువలు మచ్చుకైనా దొరకవు.
కుళ్ళు కుత్సితాలతో కునారిల్లే  వారి మనసుల్లో ఎలాంటి జాలి దయ ఉండదు.
మానవత్వ తడి లేని వారికి సాధ్యమైనంత వరకు  దూరంగానే ఉండాలి.
కొందరి మనసుల్లో ప్రేమతత్వం,చేతల్లో దాతృత్వం ఎంత దాచినా దాగదు.
  వారెప్పుడూ విరిసిన పువ్వులాంటి, కురిసే వెన్నెలంటి,వెలిగే దీపం లాంటి వారు.
అలాంటి వారితో స్నేహం పూలను కట్టిన దారంలా , వెన్నెలను మోసే మేఘంలా, దీపానికి ఆధారమైన ప్రమిదలా సదా అభిలషణీయమే.
జీవితమెలా ఉండాలో  దాచిన దాగని మంచివారికి దగ్గరగా ఉంటే గానీ తెలియదు.
జీవితం ఎంత నిస్సారమో,ఎంత వెతికినా దొరకని ఎడారి వంటి వారిని  చూస్తేనే గాని తెలియదు.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు