సుప్రభాత కవిత ; -బృంద
మౌన చింతనలో 
మధురకల్పనగా
ఎదురు చూసిన యామిని

వేసవికి తొలకరిలా
వినువీధిని  పరచుకున్న
అరుణ వర్ణ రేఖలు.

ఆకాశంలో అపరంజి బంతి
అంచెలంచెలుగా
సాక్షాత్కరిస్తుంటే....

జగతి మొత్తం చిత్రంగా
చిత్తరువై చూడసాగింది.

అంబరాన మేఘాల రంగుల
సంబరం వెల్లి విరిసింది

బంగరు వెలుగులు
మెల్ల మెల్లగా ఆవరించి
జగమునెల్ల మేలుకొలిపింది.

జీవన గమనంలో
మరో చక్కని ఉదయాన్ని
స్వాగతిస్తూ

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు