మహా మనీషులు! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సాహితీ వనమాలి!11భాషల్లో  ప్రవీణుడు.రవీంద్రుని విశ్వభారతిలో చదివి టాగూర్ కి ప్రియశిష్యుడు ఐన ఈయన రాజకీయ గురువు రాజాజీ!1955లో ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి!హైదరాబాదులో రవీంద్ర భారతి నిర్మాణం కి కారకుడు ఆయన!టాగూర్ గాలిబ్  ఇక్బాల్ ల 12కవితాసంకలనాలు తెలుగు లో అనువదించిన ఘనుడు!కంచి కామకోటి పరమాచార్య కరకమలాలతో జనహిత బిరుదు అందుకున్న భాగ్యశాలి!ఆ అభినవ భోజమహారాజు ఉత్తమ అనువాదకునిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
బ్రిటిష్ మేధావుల మన్ననలు పొందిన  మన మాజీ రాష్ట్రపతి  శ్రీ కె.ఆర్.నారాయణ్ చాలా పేదకుటుంబంలో పుట్టి  రోజూ 15కి.మీ.నడిచి హైస్కూల్ చదువు ముగించారు. ఎం.ఎ.ఇంగ్లీష్ లిటరేచర్ ఫస్ట్ క్లాస్ లో పాసై లెక్చరర్ గా  జర్నలిస్టు గా పనిచేశారు.నెహ్రూ హయాంలో రంగూన్ (మయన్మార్)లో భారత హైకమీషనరుగా ఉన్నారు. నిబంధన ప్రకారం ఫారిన్ సర్వీస్ వారు  విదేశీవనితలను పెళ్లాడరాదు.కానీ 1951లో నెహ్రూ సాయంతో బర్మా యువతిని పెళ్లాడి ఉష గా పేరు మార్చారు.చాలా దేశాల్లో హైకమీషనరుగా పనిచేసిన మేధావి!
శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య అల్లూరి సీతారామరాజు కి బడిలో సహవిద్యార్ధి!కాకినాడలో కాలేజీ లో చదువు తూ హోంరూల్ వైపు ఆకర్షింపబడ్డారు.ఆనాటి ప్రిన్సిపాల్ వెంకట రత్నం నాయుడు "వెళ్లకూడదు "అని ఆదేశాలు జారీ చేస్తే"నేను వెళ్లి తీరుతాను.ఏశిక్షకైనా నేను సిద్ధం" అని ఆ ఇంటర్మీడియట్ విద్యార్థి  రాతపూర్వకంగా జవాబు ఇచ్చాడు.1923లో"కాంగ్రెస్ " పత్రిక సంపాదకుడు ఐన ఆయనకి  దేశద్రోహి అనే ముద్రవేసిబ్రిటిష్ ప్రభుత్వం కఠిన కారాగారశిక్ష విధించింది. భార్య చనిపోయినా కూతురి పెళ్ళికి కూడా ఆయన్ని విడుదల చేయలేదు. జైల్లో  ఎన్నో దేశభక్తి పాటలు రాశారు.1953లోవెలుగు వారపత్రిక నడిపారు. జీవితపు ఆఖరి దశలో తిండి లేక  అల్లాడిన ఆయనకు రాజమండ్రిలో ఓహోటల్ యజమాని  భోజనం పెట్టి  ఆదుకున్నాడు  అని చదివితే గుండె కన్నీరు కారుస్తుంది.ఆహోటల్ వ్యక్తి పేరు తెలీదు ఎవరికీ! ఇలాంటి త్యాగశీలురు ఎందరో!తీర్చుకోలేని ఋణం!🙏

కామెంట్‌లు