ఏ.బి ఆనంద్,కు జ్ఞాపిక

 నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో  పనిచేస్తున్న కొన్ని రోజులకు  డాక్టర్ కె.వెంకట రాజు గారు పరిచయమయ్యారు. మంచి సాహితీవేత్త, ఆంధ్ర వీర అన్న పేరుతో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మొత్తం పద్యాలలో వివరించారు. భారతదేశంలో నాయకుడు అంటే అల్లూరి సీతారామరాజు అని వారి (అందరి నమ్మకం లాగా) రాజు గారితో పాటు వారి గ్రామం వెళ్లి వారికి తెలిసిన ముసలి వారిని కలిసి విషయాలు సేకరించి  తర్వాత  వారి మృతదేహాన్ని  భద్రపరిచిన గ్రామానికి వెళ్లి  అక్కడ విషయాలన్నింటిని  తెలుసుకు వచ్చాం. విజయవాడలో అల్లూరి సీతారామరాజు గారి పేరుతో  చక్కటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పత్రికలను కూడా తెప్పించి  ప్రతి సంవత్సరం  ప్రజ్ఞావంతులు  లలో ఇద్దరిని ఎన్నుకొని  అల్లూరి వారి పేరుతో బహుమతులను ఇచ్చి వారి గురించి మాట్లాడించే వాళ్ళం. డాక్టర్ గారికి అల్లూరి అంటే అంత ప్రేమ. హాజరైన పెద్దలకు జ్ఞాపికలలో కూడా  సీతారామరాజు గారి  ఛాయాచిత్రం ఉన్నవాటినే  ఇచ్చేవారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాకు సీతారామ రాజు గారిని జ్ఞాపకం ఉంచుకునే విధంగా డాక్టర్ కె వెంకట రాజు గారు నాకు జ్ఞాపికను ఇస్తున్న చిత్రం.
కామెంట్‌లు