అవని ;-ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
=============
ఆశ్రయమీ అవనిమాత 
అందరికీ శుభము వ్రాత 
ఆకలికే పంట చేత 
అనుకూలపు ఋతువుదాత 
అవనితల్లి కిదేజోత ఉమ !!

పాదముకిందను వేదము 
ప్రాణము నిల్పెడు జీవము 
కర్మలు జేసెడు యోగము 
కర్తగ నిలిపే పాఠము 
అవని అద్భుతలోకము ఉమ!!

విశ్వం నిండిన జాతులు 
హర్షం కల్గిన మాటలు 
చిత్రం చేసెడి ఊహలు 
భద్రం నిండిన దారులు 
అవనికి బాసటలు ఉమ !!

భారము మోసెడు మాతగ
నీరము నిల్పెడు కుంటగ
క్షీరము నిచ్చెడు గోవుగ
హారము ప్రకృతి తరువుగ
తోరమవని మహిమగ ఉమ!!

కామెంట్‌లు