గోరింట సంబరాలు; : సుమ కైకాల

 ఆషాడం వచ్చిందంటే
గోరింటాకు ఎర్ర చిగుర్లు తొడిగినట్లే
పుట్టింటికి చేరిన కొత్త పెళ్లికూతుర్లు
నింగిలోని చందమామని
అరచేతిలో నిలుపుకొని
పండిన ఎరుపులో
చెలికాడి ప్రేమను చూసుకొని
బుగ్గల్లో  సిగ్గుల కెంపులు పొదుపుకొని
మంగళకరమైన అందాలతో
శోభాయమానంగా కనిపిస్తారు
ఏ వయసు వారికైనా గోరింటoటే
వద్దు అనలేనoత ముచ్చట
కాలి పారాణిగా కన్నుల పండువగా
గోరింటను మించి వేరేముంది?
శుభ కార్యాలకు ముందు కావలసింది
అరచేతిలో మందారంలా పోసిన గోరింట...
గోరింట అంటేనే శుభం!!!
కామెంట్‌లు