సుప్రభాత కవిత ; -బృంద
జగత్తుకు జీవంపోసే
అనుగ్రహం .
కిరణాల రూపంలో
వర్షిస్తే.....

తొలిగా అందుకున్న  గగనం  
పండుగలా రంగులు నింపుకుంది.

పుత్తడి రవ్వలు చిమ్ముతూ
కొత్త అందాలతో మురిసిపోయింది.

స్వప్నమైన ఆశలన్నీ సత్యమై
సంతోషాలు  ముంగిట నింపుకుంది.

అలసిన మనసుకి  ఆనందంగా

కురిసిన  ప్రేమకు రూపంగా..

వడలిన  తనువుకి ప్రాణంగా

తడిసిన పుడమికి పచ్చదనంగా

మురిసిన  తరువుకి  చివురుగా

వేచిన  ప్రాణులకు ఊపిరిగా

సర్వ జగత్తుకీ  సంరక్షకుడుగా

సకలమూ తెలిసిన 
సర్వాంతరంగుని  ఆగమన
శుభవేళ  ఆనందహృదయాల

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు