ఏకత్వం ......!!----- డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ .
 స్నేహానికి 
కులం తో 
పనిలేదు !
మిత్రత్వానికి 
మతంతో 
పనిలేదు ..!
ప్రాంతంతో 
పనిఏమి ...
చెలిమికి ...?
మిత్రత్వం అంటే
ఇరు -
మనసుల 
మధుర రాగం ...!
విడదీయరాని
ఆత్మీయ --
అనుబంధం...!
ఎల్లలుఎరుగని
ఏకత్వం.....!
ఇరుహృదయాల
లోగిలిలో -
ప్రేమ తత్వం..!!

            ***
(అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంసందర్భం)

కామెంట్‌లు