బాగున్నాయ్ ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాగున్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయ్ బాగున్నాయ్

బాలల మాటలు పంచదార చిలకలు
బాలల మాటలు వెన్నముద్దలు
బాలల మాటలు గోరుముద్దలు
బాలల మాటలు రసాలగుళికలు 
బాగున్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయ్ బాగున్నాయ్

బాలల చేతలు గిలిగిలి గింతలు
బాలల చేతలు నవ్వుల పువ్వులు
బాలల చేతలు తీపి గురుతులు 
బాలల చేతలు ఆనందడోలికలు 
బాగున్నాయ్ బాగున్నాయ్ 
బాగున్నాయ్ బాగున్నాయ్

బాలల పాటలు తేనెల సోనలు 
బాలల పాటలు వీనులవిందులు 
బాలల పాటలు మది పులకింతలు
బాలల పాటలు వేదశ్రుతులు
బాగున్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయ్ బాగున్నాయ్

బాలల సన్నిధి నందనవనము
బాలల సన్నిధి బృందావనము
బాలల సన్నిధి ఆనందాల పెన్నిధి
బాలల సన్నిధి స్వర్గపు సన్నిధి
బాగున్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయ్ బాగున్నాయ్

బాలలందరు సుగుణరాశులే
బాలలంటే మణిపూసలే
బాలలంతా స్వాతిముత్యాలే
బాలలంతా భావిపౌరులే
బాగున్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయ్ బాగున్నాయ్ !!


కామెంట్‌లు