సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
 గుర్తుంచుకుని... గుర్తొచ్చినపుడు...
******
 జీవన ప్రస్థానంలో కొందరు బాగా గుర్తుండి పోతారు. కొందరు మనల్ని బాగా గుర్తుంచుకుంటారు.
అలా మనల్ని గుర్తుంచుకుని ఫోన్లోనో ,ముఖతా ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఆనందమే వేరు. వారి మనసులో మనం గుర్తుండి పోయామన్న ఆలోచనే మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
అయితే కొందరికి ఏ అవసరార్థమో గుర్తొస్తూ ఉంటాం. ఆ సమయంలో మనమైతే చేయగలం అనేది గుర్తొచ్చి మాట్లాడుతూ ఉంటారు.
అలా గుర్తొచ్చినప్పుడు మాట్లాడటంలో వాళ్ళ స్వార్థం ఉంటుంది.
 గుర్తుంచుకుని మాట్లాడటంలో వాళ్ళ ప్రేమ,అభిమానం,ఆప్యాయత, గౌరవం లాంటివి ఉంటాయి.
కాబట్టి గుర్తొచ్చి మాట్లాడిన వాళ్ళను గుర్తుంచుకోక పోయినా ఫరవాలేదు కానీ మనల్ని గుర్తుంచుకుని మాట్లాడే వారిని ఎప్పుడూ మరచిపోకూడదు. దూరం చేసుకోకూడదు.
 మనమూ  వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడితే, అది వారికి మనం ఇచ్చిన గుర్తింపు అవుతుంది.
సమాజంలో ఇలాంటి అనుబంధాలు, స్నేహాలే చిరకాలం నిలుస్తాయి.కలకాలం గుర్తుండి పోతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు