సిని డైరెక్టర్ వి. మధుసుధన్ రావు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.
 కళాశాలలో చదువుతున్న  రోజులలో నాతోపాటు బలిదానం నాటకంలో పాల్గొన్న రవీంద్రనాథ్  మద్రాస్ కు వెళ్లి సినిమాలను అవగాహన చేసుకొని  మళయాళంలో బాగా విజయవంతమైన సినిమాను తెలుగులో అంగడిబొమ్మగా తీయడానికి ప్రయత్నం చేశాడు. వి మధుసూదన్ రావు గారు దర్శకుడు, కోదండరామి రెడ్డి గారు సహ దర్శకుడు  మళయాళంలో నటించిన కథానాయిక సిమిని కథానాయికగా ఎన్నుకున్నారు  విజయవాడలో నిర్మాణ నిర్వహణ జరిగింది.నన్ను జ్ఞాపకం పెట్టుకుని రవీంద్రనాథ్  సినిమాలో కథానాయిక తండ్రి వేషం వేయవలసి ఉంది  రాగలవా అని అనడిగితే  వెళ్లాను. నాకు భార్యగా  సాకే ఉమ( నేటి సిని నటి అన్నపూర్ణ) ఎన్నికయింది. మేమిద్దరం కథానాయిక తల్లిదండ్రులం నాకు పంచ కట్టడం చేతకాకపోతే మధుసూదన్ రావు గారే వచ్చి కట్టారు. నా వేషానికి కోదండరామి రెడ్డి గారు  తీసుకున్న సూచనలతో దిగిన ఛాయాచిత్రం.


కామెంట్‌లు