అక్షరాల కార్ఖానా డా. కె.శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు; డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు
 'పాశర్లపూడి బ్లో ఔట్  బామ్మర్ది తో సరదాగా మాట్లాడే టాపికా?' అని నన్ను పాతికేళ్ల  కిందట ప్రశ్నించిన గొంతు శ్రీనివాస్ గారిది. ఏదైనా సమకాలీన అంశంపై హాస్యధోరణిలో రాయమని ఆ రోజుల్లో ఇచ్చిన హోం  వర్క్ కు నేను రాసిన అంశం 'పాశర్లపూడి బ్లో ఔట్'.  ఏదైనా టాపిక్ పై  బాగా రాసి  ఆయనను మెప్పించాలని నేను చేసిన ప్రయత్నం ఆ విధంగా బెడిసికొట్టింది. 
సరే .. క్రియేటివ్ రైటింగ్ లో కాకపోయినా అనువాదంలో ఆయనను 
మెప్పించాలని అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించారు. అందులో నేనూ ఉన్నా. ఆయనతో అంత  ఈజీగా 'ఓకే ' అనిపించలేం గదా.. ఎవరికైనా ఆయన వేసే మార్కులు 50 లోపే. అందులోనూ 40 వచ్చాయంటే అనువాదంలో పాస్ అయినట్టే ఫీల్ అయ్యేవాళ్లం.  బహుశా ఆయన దిద్దిన వాటిలో అత్యధికంగా 54 మార్కులు పొందినవాడిని నేనే కావచ్చు. ఆరోజుల్లో సంతోషానికి అదీ ఒక కారణం. 
అప్పట్లో రెండు దినపత్రికల్లో ఒక ప్రధాన వార్తకు ఒకటే హెడ్డింగ్ పెట్టారు. ఈ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ఆయన జవాబు.. 'ఫూల్స్ థింక్ అలైక్' అని. అలా ఒక్కోసారి ఎంతో మాట్లాడతారనుకుంటే ఒకే మాటలో జవాబు వస్తుంది ఆయన నుండి. అదీ పవర్ ఫుల్ జవాబు. ఆ చర్చకు అంతకంటే  మించిన సమాధానం లేదు కదా! అదీ ఆయన స్టైల్. 
ఈ సంఘటనల తర్వాత ఇరవయ్యేళ్లకు 2016  ఏప్రిల్ 17న నేను రాసిన 'అమ్మంగి వేణుగోపాల్ రచనలు- సమగ్ర పరిశీలన' ఆవిష్కరణ సభకు శ్రీనివాస్ గారు విశిష్ట అతిథిగా హాజరై ఆశీస్సులు అందజేశారు. సభ అయ్యేదాకా ఉండి, ప్రేమామృతధారలు కురిపించారు. 
నేను రాసే అక్షరాల వెనుక ఆయన ప్రమేయం, ప్రభావం ఉన్నాయి. 
'కే' అంటే 'ఓకే' అని 
'ఎస్' అంటే 'ఓయెస్' అని 
రెండక్షరాలూ అంగీకార సూచికలే 
'కే  ఎస్ ' అంటే మాత్రం విరుద్ధం 
మెప్పించడం కష్టం 
'శ్రీ' అంటే 'డబుల్ శ్రీ' కాదు.. 
'శ్రీశ్రీ' కవితావేశం 
అడుగడుగునా ఆయన వ్యాసాల్లో .. 
దాశరథి కీ సినారె కూ 
మధ్య పుట్టిన దిగ్గజం  
దాశరథి పాండిత్యం 
సినారె పరిశోధనం 
అగ్నికణమైన దాశరథి కవిత్వం 
వెన్నెల కురిపించే సినారె పాట 
ఆవేశం 
ఆలోచన 
విశ్లేషణ 
సూచన 
ప్రతి అక్షరంలో కూర్చి 
ప్రయోగించే ధీశాలి   
అక్షరాల కార్ఖానా 
అనుభవాల ఖజానా 
మా గురువు గారు 
'ఆంధ్రజ్యోతి' సంపాదకులు 
డా. కె.శ్రీనివాస్ గారికి 
పుట్టినరోజు శుభాకాంక్షలు

కామెంట్‌లు
Ramaa Ramana చెప్పారు…
అద్భుతః
Unknown చెప్పారు…
కే. శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
బాగుంది మీ వ్యాసం.