ప్రబోధ గీతిక;--గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు.
మనిషి ఆయువు పెరగాలంటే
స్వచ్ఛ వాయువు కావాలంటే
తరువులు చాలా పెంచాలోయ్!!
కరువులు దూరం చేయాలోయ్!!

ప్రగతికి బాటలు వేయాలంటే
జగతికి మేలు చేయాలంటే
పచ్చని మొక్కలు నాటాలోయ్!
మనలో ప్రతిభను చాటాలోయ్!

కాలుష్యాన్ని తరమాలంటే
ఆరోగ్యమే పొందాలంటే
అవనిలో చెట్లు ఉండాలోయ్!
అందరి బాధ్యత  ఇదేనోయ్

దేశం వృద్ధి చెందాలంటే
దేశ కీర్తిని నిలపాలంటే
కలసిమెలసి ఉండాలోయ్!
కలహాలన్నీ మానాలోయ్!!


కామెంట్‌లు