తోట ;-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఆహా!
నేను వచ్చేస్తానిక
నీతోటలో చిలుకా కోయిలా
నెమలీ కుందేలూ కోతీ 
అల్లరి చేసే నా నేస్తాలున్నారు
పాదులుతీసే మాలులున్నారు 
పరుగులు తీసే బాలలున్నారు
నీటి గలగలలున్నాయి 
రంగుల హరివిల్లుంది
ఆకులున్నాయి పూలున్నాయీ
రెమ్మలున్నాయి కొమ్మలున్నాయీ
మొక్కలున్నాయి చెట్లున్నాయీ
బుద్ధుడు పుట్టిన మద్ది చెట్టుంది 
ఆయన జ్ఞానం పొందిన రావిచెట్టుంది
దత్తుడు ఉండే మేడిచెట్టుంది
సాయి కొలువుండే వేపవృక్షముంది
ఉత్సాహం ఉల్లాసం సంతోషం 
దివ్య పరిమళమై తేలియాడుతోంది
ఇక నేను ఆగలేను మిత్రమా
నీ ఊహల తోటలోకి వచ్చేస్తున్నానిక !!

కామెంట్‌లు