ఉపకారం ; - ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
============
పదిమందికి ఉపకారము 
మనకిచ్చును సహకారము 
ప్రతిదానికి గుణకారము 
తగ్గించును మమకారము 
సాధించు అధికారము ఉమ !!

పంచభూతాలు చేయును 
మంచిగాలి మరి  వీచును 
స్వచ్ఛ జలములే పారును 
అగ్ని పచనమే చేయును 
నింగిన వర్షం కురియునుఉమ !!

అసలు నివాసం భూమి 
ఆమెనే  మరుచుట ఏమి 
పంటలు తరువులే స్వామి 
మనకెందుకుకికా  లేమి 
సకలాధారము భూమి ఉమ!

పొరుగుకు చేసిన  సాయము 
ఇరుగుకు అదేగ ధ్యేయము 
పగలూ కుట్రలు మాయము 
పరోపకారము కాయము 
అభివృద్ధిక ఖాయము ఉమ!!

కామెంట్‌లు