ఆశ !!?; -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
సముద్రంలోకెళ్లేవాళ్లు
ఆకాశంలోకి వెళ్లేవాళ్లు
ఏదైనా దొరుకుతుందని నమ్మకంతో వెళ్ళరు
ఏదైనా దొరుకుతుందన్న ఆశతో వెళ్తారు!!?

ఇప్పటివరకు ఈ దేశంలో కెళ్లేవాళ్లు
ఎవరో దొరుకుతారని వెళ్లలేదు కానీ
వివేకానందుడు దొరికాడు
గాంధీ దొరికాడు రవీంద్రుడు దొరికాడు
విక్రమ్ సారాభాయి దొరికాడు, ఇందిరాగాంధీ దొరికింది.

ఫలాలను పంచుకుంటేనే కాదు
ఒలుచుకు తింటేనే ప్రతిఫలం తెలిసేది!!?

నీవు దుస్తులను ధరిస్తేనే
నీ నిజరూపం తెలిసేది !!?

నీవు నీ కర్మలన్నీ విసర్జిస్తేనే
నీ కర్మఫలం కనుగొనేది!!?

నీవు అసహ్యాన్నీ-అసహనాన్ని వదిలేస్తేనే
పరిమళం నిర్మలం నీవు అనుభవించేది!!?

ఎంత చెక్కిన చెట్టును తీర్చిదిద్ద లేవు
మతిస్థిమితం లేని మనుషుల
గాయాలను మాన్చలేవు!!?

పర్వతాన్ని పడగొడితే రాయి దొరుకుతుంది
రాతిని చెక్కితే శిల్పం వస్తుంది!!
చెత్తనంతా తొలగిస్తేనే
ఉత్తమమైనది దొరుకుతుంది!!?

స్త్రీ పురుషులు
వృక్షాలను జంతువులను తొలగించి
తొలిస్తేనే మనుషులంతా పుట్టుకొచ్చారు!!?

ఏదైనా నీవు పట్టుకుంటేనే పట్టు
ముట్టుకుంటేనే ముత్యం కావు
ఆశతో అన్వేషిస్తేనే అవి కనిపిస్తాయి!!?

Sunita Pratap teacher palem
8309529273

కామెంట్‌లు