నీటిలోని చేప;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 భూమి మీద నివసించే మానవుడు కానీ, నీటిలో ఉన్న జీవరాశి కానీ  ఏది ఎక్కడ జీవిస్తున్నా అది ఆశ తోనే జీవిస్తుంది. మనిషిని ఒక్కడిని ఆశాజీవి అనడానికి వీలు లేదు. క్రిమికీటకాదులు కూడా ఆశతోనే జీవిస్తాయి. ఏ జీవి ఉన్న దానితో తృప్తి పడదు. తనకు నాది కాకుండా ఇంకా ఏదో కావాలన్న కోరిక పీడిస్తూనే ఉంటుంది. దాని కోసం ప్రయత్నం చేస్తుంది.  తనకున్న దానితో పాటు ఎదుటివారి ఆస్తిపాస్తులు కూడా కావాలన్న ఆశ అతనిని పీడిస్తూనే ఉంటుంది. అసాధ్యమని తెలిసినా ఆ కోరిక మాత్రం పోదు. నీటిలో నివసించే చాపలు చూడండి నీటిలో చేరిన చేప దానికి కావాల్సిన ఆహారాన్ని అక్కడ సేకరించి, ప్రశాంతంగా జీవిస్తున్న  సమయంలో  జాలరి వచ్చి ఏరను దానికి ఆహారంగా ఏర్పాటు చేసి దానిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటిలో  సంపాదించుకుంటున్న చేప  కొత్త ఏరను చూద్దామన్నా ఆకాంక్షతో వచ్చి ఆగాలని తగిలి  జాలరి ఇంటిలో కూరగా మారుతుంది.ఇక మానవ జీవితం చూస్తే ఎన్నో   ప్రలోభాలకు లోనై  కష్టపడకుండా ధనాన్ని సంపాదించవచ్చు అన్న  దురాశతో  మాయగాళ్లు ఎదురుపడినప్పుడు మోసపోయి ఉన్నది కూడా పోగొట్టుకునే దురదృష్టవంతులు. అలాంటి దురాశకు  మనసులో స్థానం కల్పించకండి అన్న నీతిని చెప్పాడు వేమన.


కామెంట్‌లు