మార్పు! అచ్యుతుని రాజ్యశ్రీ

 వర్షాలు తెగముంచెత్తుతున్నాయి.వరదనీటిలో జనాలు కొట్టుకుపోతున్నారు.12ఏళ్ల శివా వరదలో కొట్టుకుపోతూ ఓచెట్టు కొమ్మపట్టుకుని ఎక్కి గువ్వలాగా కూచున్నాడు. పడవవాడు చూసి వాడిని కాపాడి తమ ఊరి కామందు ఇంటికి తీసుకుని వెళ్లి అప్పగించాడు.50దాటిన కామందు భార్య ఆస్థమా రోగి.పిల్లలు లేరు.60దాటిన ఆమెభర్త ఆఊరి మంచి చెడులు చూస్తూ ఉంటాడు.ఎవరినైనా పెంచుకుందాం అనిభార్య రోజూ పోరుతుంది."చూడు! బంధువుల పిల్లలని అడిగామనుకో మొహమాటం  మన ఆస్తి కోసం  దత్తత ఇస్తారు. ఊహతెలిసిన పిల్లాడు  మనల్ని  అమ్మా నాన్న లు గా ప్రేమించలేడు.పసిపాప ను తెచ్చి పెంచే ఆరోగ్యం ఓపిక మనకిలేవు.కాస్త పెద్దవాడిని తెస్తే మనపీకపిసికి పారిపోతే గతిలేదు.సొంతపిల్లలే కన్నవారిని బైటకి గెంటే రోజులు"అని ససేమిరా  అన్నాడు. శివా అమ్మా నాన్న లు కరోనా కిబలైనారు.ఆఊరివారి దయాధర్మాల పై పెరుగుతున్నాడు.అందుకే  కామందు  భార్య సీత వాడిని బాగా చేరదీశారు. సీతకి వాడి రాకతో ఆరోగ్యం బాగుపడింది. దగ్గర కూచోబెట్టుకుని చదువు చెప్తోంది. బడి 5కి.మీ.కామందు కి ఇష్టం లేదు. కానీ భార్య కి చేదోడువాదోడుగా ఉన్న  వాడిని అందుకే  ఉంచేశాడు సీత దగ్గర! సీత అన్న మనవలు శివా ఈడువారు రెండు రోజులు ఉండి పోదామని  పక్కన ఉన్న పట్నం నించి వచ్చారు.శివా తో ఆడుతూ ఊరంతా ముగ్గురు తిరిగేవారు. వారి దగ్గర 3స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకటి సీత కు ఇచ్చారు. ఆపిల్లలతో ఫోన్ తో సీత ఎక్కువగా గడుపుతున్నది.ఇదికాస్త శివా కి బాధ గా ఉంది. తాను పరాయి అనాధ అనే భావం వాడిని పట్టి పీడిస్తోంది. అందుకే సీత ఫోన్ ని దాచేశాడు తనుండే సామాన్ల గదిలో!ఆర్నెల్ల బట్టి సీత ప్రేమ ఆప్యాయతలను తనొక్కడే పొందుతున్నాడు.కానీ ఇప్పుడు ఆఇద్దరి రాకతో వాడిలో చిన్న పాటి అసూయ హీనభావం తొలిచేస్తున్నాయి.శివా కి తమబంతి ఆటసామాను మంచి డ్రెస్సులు ఇచ్చినా వాడిలో ఆత్మన్యూన్యతా భావం ఎదిగిపోతోంది. ఆరోజు వారు వెళ్లి పోతున్నారు. "అత్తా!నీఫోన్ ఎక్కడ?మాకు ఇచ్చేయి "."అయ్యో!మొన్నటి నుంచి కనపడటంలేదురా!మీరు తీసుకున్నారనుకున్నా".ఇల్లు అంతా వెతికి"పోనీలే! సీతవ్వకి ఇచ్చాం అని చెప్తాములే!"అని వారి ఊరికి వెళ్లి పోయారు. మూడీగా దిగాలుగా ఉన్న శివా ని లాలనగా అడిగింది "నీఫ్రెండ్స్ వెళ్లారని దిగులుగా ఉందా శివా?".వాడు భోరుమని ఏడ్వసాగాడు. పావుగంట ఏడ్చాక వాడి మనసు తేలిక పడింది "అమ్మా! ఆపిల్లలని బాగా చూస్తూ  నన్ను తక్కువ చేస్తున్నారు అని నేనే ఆఫోన్ దాచాను." వాడితల నిమురుతూ లాలనగా అంది సీత "రాకరాక వచ్చిన  పిల్లలు!అందుకే వారితో ఎక్కువ సేపు గడిపాను. ఆఫోన్  నాదగ్గర ఉంచుతా! రోజూ  ఓగంట నీకు ఇస్తా సరేనా?" శివా సంతోషంగా తలూపాడు..."అమ్మా!"అంటూ వచ్చిన  శివా 70ఏళ్ల సీతమ్మ చేతిలో  పళ్ళు పెట్టాడు.ఇప్పుడు అతను  ఓకంపెనీకి సి.ఇ.ఓ.సీతమ్మ అతని ఇద్దరు పిల్లలతో హాయిగా ఆడుతూ పాడుతూ తన వృద్ధాప్యంని ఆనందం గా గడుపుతోంది. 🌷
కామెంట్‌లు