పెరిగిన జనాభా ; *యం వి.ఉమాదేవి : *నెల్లూరు
 అడ్డూ అదుపూలేని జనాభా 
ఆహారం లేక అలమటించే దేశాలు 
ఆధునిక వసతులు, ఆవిష్కరణలూ ఉన్నా 
వ్యవస్థ స్వేచ్ఛ, వ్యక్తి స్వతంత్రతలో 
కానరాని ముందుచూపు,విచక్షణ 
ఇంకా ఇంకా నిరక్షరాస్యత... 
ఎన్నో కారణాలు విశాలవిశ్వం 
మనుషులతో కిక్కిరిసి పోయేలా... 
మందిఎక్కువైతే మజ్జిగ పల్చన 
అన్నట్టుగా.. సరిపోని ఆహారనిల్వలు 
కొన్నిచోట్ల గోదాముల్లో ముక్కిపోతున్న స్వార్థం 
కొన్ని ఎక్కువ నోట్లకోసం 
సమయం దాటినా అమ్మే పదార్థాలు 
గోమాతల మరణానికి దారితీసిన ధనకాపీనం 
సోమాలియా వంటి చోట్ల 
జీవచ్ఛవాల్లా ఆకలితో పసివారు 
నివాసాల కోసం ప్రకృతి సిద్ధవనాలు,అడవులధ్వంసం 
పంట పొలాలను ఇళ్ల ప్లాట్లుగా 
అమ్మిన రాజకీయ నీచపుబుద్ధి 
యెన్నటికీ పరిష్కారంలేని 
అధిక జనాభా సమస్యను దేశాలు 
పట్టించుకునేలా 
మేధావులు పరిష్కారం చూపాలి!!

కామెంట్‌లు