ఈ మూడు ప్రశ్నలూ ముఖ్యం;-- జయా
 ఎవరైనా కావచ్చు 
ఎవరి గురించైనా కావచ్చు
ఎంతసేపైనా ఉన్నవీ లేనివీ  
మాట్లాడమంటే
ఎంత ఇష్టమో కదూ...
కానీ 
ఓ మనిషిగా 
ఆ వ్యక్తి పక్కన నిల్చుని 
మాట్లాడవలసి వస్తే 
తెలుస్తుంది....
అందుకే సోక్రటీస్ తన వద్దకు ఎవరి గురించో ఏదో ఒకటి చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన మూడు ప్రశ్నలు వేసేవాడట. ఆ మూడు ప్రశ్నలకు సరైన జవాబులు వస్తేనే చెప్పడానికొచ్చిన విషయాన్ని చెప్పమనేవాడు. లేకుంటే వెళ్ళిపోమని నిర్దయగా చెప్పేసేవాడు సోక్రటీస్. 
అవేంటంటే, 
మొదటిది - నువ్వు చెప్పబోయే విషయం నీకు తెలిసిన నిజమేనా? 
ఈ ప్రశ్నకు వచ్చే జవాబు - ఆ మనిసి గురించి ఎవరో మరెవరితోనో చెప్పగా ఆ మరెవరో ఇంకొకరితో చెప్పారు. ఇలా ఓ విషయం పది మంది మధ్యా చక్కర్లు కొట్టాక నా చెవిన పడితే అది మీకు చెప్పాలనిపించింది. 
ఇక రెండో ప్రశ్న...
ఫలానా వ్యక్తి గురించి మీరు చెప్పే విషయం మంచి విషయమేనా? అలాగైతే చెప్పండి వింటాను. లేకుంటే నేను మీ మాట వినడానికి సిద్ధంగా లేనని చెప్పేసేవాడు సోక్రటీస్. 
ఇక మూడోదైన చివరి ప్రశ్న - 
మీరు చెప్పబోయే మీకు గానీ నాకు గానీ లేదా ఆ మూడో వ్యక్తిగానీ మంచి చేస్తుందా...అవును మేలు చేస్తుందనిపిస్తే చేప్పండి వింటాను.కాదు అలా మంచిదేం కాదనుకుంటే నాకు మీరేమీ చెప్పకుండా ఇక్కడి నుంచి దయచేయొచ్చు అని సోక్రటీస్ నవ్వుతూ చెప్పేవాడు.
సోఖ్రటీస్ వేసే ఈ మృడు ప్రశ్నలూ ఎంత బాగున్నాయో కదండీ.


కామెంట్‌లు