సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నడిచే... నటించే...
  ******
మనం జీవితంలో గెలుపు ఓటములు చవి చూసే సమయంలో మనచుట్టూ కొందరు ఉంటారు.
వాళ్ళలో కొందరు మన వెంట  ధైర్యం చెబుతూ నడిచే వాళ్ళు ఉంటారు. 
 మరి కొందరు శల్య సారథ్యంతో మానసికంగా ఓడిపోయేలా చేస్తూ, మనతో నడుస్తున్నట్లు నటించే వాళ్ళూ వుంటారు.
మన అభివృద్ధిని, విజయాన్ని కాంక్షిస్తూ మన వెంట నడిచే వారికి నటించడం, ముఖస్తుతి మాటలు మాట్లాడటం రాదు.
కానీ నటించే వాళ్ళకు అవి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళనే అత్యంత ఆప్తులుగా భావించే ప్రమాదం ఉంది.
 కాబట్టి సూచనలు సలహాలు ఇస్తూ లోపాలను ఎత్తి సరిదిద్దే వారెవరో, పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించే వారెవరో నిశితంగా మనసు పెట్టి గమనిస్తూ ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు