సుప్రభాత కవిత ; బృంద
మౌనంలో ఎన్నో ప్రశ్న లూ.
మరెన్నో సమాధానాలు.

మౌనంలో మనసుతో
రాజీలు.

మనసుతో మౌనానికి
సర్దుబాట్లు.

మౌనంలో తప్పులు
దిద్దుబాట్లు

మౌనం ఒక యుధ్దం
మౌనం ఒక ఆయుధం
మౌనం ఒక సమ్మతం
మౌనం ఒక ఔషధం 
మౌనం  ఒక అసంతృప్తి
మౌనం   ఆత్మానందం

మౌనం  మనసుకు వేసే తెర

మౌనం  మనసును 
తొలిచే వ్యధ

మౌనం  కోపానికి అర్ధం
మౌనం శాంతానికి గుర్తు
మౌనం సహనానికి రూపం

ఆనందం ఎక్కువైనా
మౌనమే!
బాధ ఎక్కువైనా మౌనమే!
మౌనం ఒక నేస్తం

మౌనానికి సమాధానంగా
వచ్చే ఉదయం కోసం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు