అనంత పయనం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు
 పంతాల, పౌరుషాల పొగలు...
పగల పట్టింపుల సెగలు...
కులాల ఆర్భాటాలు...
మతాల మోమాటాలు...
ఆత్మాభిమానం అన్న బరువులు...
పైసాకి పనికిరాని 
పరువులు...
మనలో మనకే 
ఆరాటలు...
ఫలితాలు లేని 
పోరాటలు...
అసలెందుకిప్పుడు
గీతల, రాతల గమనంలో 
గమ్యమైన అంతిమ పయనం
అనంత పయనమే అని అందరికి తెలిసినప్పుడు....??


కామెంట్‌లు