సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఖచ్చితత్వం... కారుణ్యత్వం...
   *****
మనలో ఉండాల్సిన లక్షణాల్లో ఖచ్చితత్వం, కారుణ్యత్వం అనేవి చాలా ముఖ్యమైనవి.
కొన్ని విషయాల్లో ఖచ్చితత్వం లేకపోతే  మనపట్ల పూర్తి విశ్వాసం నమ్మకం ఉండదు.
నమ్మకంతో చేయాల్సి వచ్చే పనుల సందర్భాల్లో అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
మన మాటలు,చేతలే  మనలో ఉన్న ఖచ్చితత్వాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తాయి.
అయితే  అన్ని విషయాల్లో ఖచ్చితత్వం ఉండకూడదు.
వాటిల్లో కొన్ని  మానవీయ బంధాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి విషయాల్లో  పట్టువిడుపులు ఉండాలి.  తెలిసీ తెలియక చేసే పొరపాట్లను క్షమించగలిగే కారుణ్యత్వం ఉండాలి.
 అలా మనమేంటో ఋజువు చేసుకునేలా ఖచ్చితత్వం, మనసేంటో అర్థమయ్యేలా కారుణ్యత్వం మనలో బొమ్మా బొరుసుల్లా ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు