పలుకని సమాజం;-డా. నీలం స్వాతి,
 అందరికి తెలిసినదే పట్టుదలగా లక్ష్యం దిశగా 
పరుగులు పెడుతూ పదిలంగా సాగుతున్న 
జీవితాల వైపు పత్రీపట్టనట్టు వ్యవహరిస్తుంది 
ఈ సమాజం…
అదే ఆశయాలు అందుకునే సమయంలో 
ఏదో ఎదురు దెబ్బలు తగిలి నేలకు ఒరిగితే
సూటిపోటి మాటలతో ఎదురొచ్చి మరీ
పరిచయాలు పెంచుకుంటుంది 
ఈ సమాజం…
గాయపడిన గాయాలను చూసి గోరంత 
మందును పూసి కనికరం చూపక,
గాయపడిన మనిషిని పట్టుకొని విభిన్న 
ప్రశ్నలతో ఓదార్పు నెపంతో 
ఊక్కిరి బిక్కిరి చేస్తుంది...
ఎలా అంటారా???
వ్యక్తి పనితనాన్ని ప్రశ్నిస్తూ...
నీకు చేవ లేదా అంటుంది??
నీకు చేత కాదా అంటుంది??
ముందుకు సాగలేవాఅంటుంది???
ముందుకు నువ్వు సాగు సాయంగా 
మేమున్నాం నీ వెంట అంటుంది ఈ సమాజం...
నమ్మి నువ్వు ముందుకు వచ్చావా...
చివరిక్షణంలో నీ పోరాటం నీదేనని
స్వార్ధంగా వెన్ను చూపడమే  
ఈ సమాజ నైజం....
ఇది అనుభవించబడిన,
అనుభవించబడుతున్న
అనుభవించబోతున్న ప్రతి ఒక్కరికి అవగతమైన,
అవగతమోతున్న, అవగతమవ్వబోతున్న 
నీతిని వివరించే పచ్చి నిజం...


కామెంట్‌లు