ప్రవృత్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా తండ్రి  మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్. ఉన్న కాస్త పొలం పుట్ర చూసుకుంటూ చుట్టుపక్కల పిల్లల కి నేర్పుతుంటాడు.శివా తాత మంచి శిల్పి!దాదాపు  అరవైఏళ్ల వయసు లో ఉలిసుత్తి చేతబట్టి  చెట్టుకింద శిల్పాలు చెక్కుతుంటాడు.శివా తాతపక్కనే రాత్రి పూట పడుకుంటాడు. నాల్గుగంటలకే లేచి శివా ని లేపుతాడు.కళ్ళపై రెండు అరచేతులు పెట్టుకొని  "కరాగ్రే వసతే లక్ష్మి "శ్లోకం చదువుతూ తన కనురెప్పలు నెమ్మదిగా తెరుస్తాడు. శివా తో చెప్తాడు "మన కంటి శక్తి  తిరిగి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఠక్కున కళ్లు తెరిచి చూడరాదు.ఇక మన చేతివేళ్లతోనే పనులు చేసి డబ్బు సంపాదిస్తాం.అన్నంతింటాం.అందుకే లక్ష్మి మధ్యలో సరస్వతి (పుస్తకం ని అరచేతిలో పట్టుకుంటాం) అని అమ్మల కన్న అమ్మ గౌరిదేవిని తల్చుకుంటే చాలు.మానసిక శారీరక శక్తి లభిస్తుంది. "
"తాతా!నేను నీలాగ శిల్పాలు  చెక్కుతా!బడికెళ్ళను"అని మారాంచేసేవాడు.తాత ఇలా నచ్చజెప్పేవాడు"బుల్లోడా! నావృత్తికి గిరాకీ తగ్గింది. త్వరగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో బొమ్మలు చేయటం నేడు సులభం! మన ఊరి గుడికి ఈదీపస్థంభాలు నాకానుకగా చెక్కుతున్నాను.బడికెళ్ళి చదివితేనే నోట్లోకి నాలుగువేళ్లుపోతాయి". శివా కి ఏమీతోచక"ఔను!రాయిచెక్కటం కష్టం " అని సర్దిచెప్పుకొంటూ "నాన్నా!డ్రాయింగ్ నేర్చుకుంటా!అన్ని సబ్జెక్టులు చదవడం కష్టం గా ఉంది " అని మొండికేశాడు.నాన్న వాడిని బుజ్జగిస్తూ రోజూ చెప్తాడు"శివా!నేను  ఇలా మొండికేసి తాత బలవంతం పై టెన్త్ గట్టెక్కాను.పొలంకూడా వరదలకు మునిగిపోయింది. నీవు బాగా చదివి ఉద్యోగం లో స్థిరపడిన తర్వాత  ఈహాబీని వృద్ధి చేసుకో!రంగుల పెయింటింగ్స్ ఖరీదు ఎక్కువే! కాలంతో పాటు మన కులవృత్తి కూడా మారుతుంది! బడికి వెళ్లు.డ్రాయింగ్ వేయి.నీలాంటి పిల్లలని ప్రోత్సహించాలని మొలక లో వేదాంత సూరి అంకుల్ ఛాన్స్ ఇస్తున్నారు కదా!ఇవన్నీ ప్రవృత్తులు హాబీలు." సరేఅంటూ శివా బడికి తయారు అవుతున్నాడు🌹
కామెంట్‌లు