చిత్రానికి గజల్ ;-రాజీకోడూరు
రేయెండగ కనిపించే రాయంచకు దిగులేలో
కనుచాటున దిగమింగే వెతలకింత గుబులేలో

ఎటుచూసిన ఎడారిలా మారిపోయె లోకమంత
దరిచేరని వర్ణుడితో స్నేహానికి తపనేలో

వనాలలో  తరువులన్ని  తలదించెను వగచూపుచు
కనుచూపున ఎండమావి కవ్వింపుల గోలేలో

తొలకరికై ఎదురుచూస్తు చకోరమై  నిలిచిచూడ
పలకరించు పవనాలను తడమాలని ఇతమేలో

ఆమనికై  రాజి కనులు ఎదురుచూచె  ఆత్రముగా
అంబరాన జల్లులకై   పుడమితల్లి చవియేలో


కామెంట్‌లు