స' గుణింత గేయం;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
స ఖ్యతతో సాగుదాం
సా మరస్యం  చాటుదాం
సి రిమల్లెచెట్టు అవుదాం
సీ మలోన విహరిద్దాం

సు గుణాలు చూపుదాం
సూ క్తులు పాటిద్దాం
సృ జనాత్మక  తోటలో
సౄ అంటూ స్మరిద్దాం

సె ల్ తగినంత వాడుదాం
సే దదీరి మసలుదాం
సై అంటూ చదువులోన
సొ గసుగా నేర్చుకుందాం

సో మరితనం వీడుదాం
సౌ ఖ్యంగా బ్రతుకుదాం
సం పూర్ణ పనులు చేసి
సః  ..సః ..సః అందాం


కామెంట్‌లు