దాశరథీ! ;-డాక్టర్ ఒజ్జల శరత్ బాబు
గుండెను పిండి జేసి యరి కుత్తుక గోయు కవీంద్రుడెవ్వడే
నిండుగ పొత్తమంత నవనీతము నింపు కవీశుడెవ్వడే
దండిగ చిత్ర గేయమధుధారల నింపిన  శిల్పి వాడె పో
గండరగండ దాశరథి గా!కెవడీతెలగాణ వేద్యుడున్ 

రగిలించినావు మగటిమి
పగతుడు నైజామునణచె పరుషపు వాక్కున్
సొగసద్ది మేలు కొలుప గ
లిగినావు నీకు ప్రణతులు లెంకా! యెపుడున్ 

కారాగారపుసింహ పౌరుషపు సాకల్యంబు జూపెట్టి బూ
జౌ రాజున్వణకించినావు ఘనధైర్యౌజస్సు తెల్పంగ లే
మే! రాజీ పడబోని నిండు తనమున్ యీగంగ రానేర దో
నీరమ్యంపు మనోజ్ఞ వీథులవి వే నేనేల జెప్పంగనే.; -

కామెంట్‌లు