తరాలు మారినా...; - సుమ
 "చింటూ, నీ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తుంటే చింపి పారేయాలి అనిపిస్తుంది. ఇంత తక్కువ మార్కులా? నీ వయసులో నేను ఎలా చదివేవాడినో తెలుసా? నేను సంతకం పెట్టను. మీ అమ్మతో పెట్టించుకో " రుస రుస లాడుతూ వెళ్ళిపోయాడు వినీల్.
"తాతయ్యా, మా డాడీ  నాలా ఉన్నప్పుడు బాగా చదివేవారా? బోలెడన్ని మార్కులు వచ్చేవా?" హాల్ లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న రాజారావు దగ్గరకొచ్చి అడిగాడు చింటూ.
"మీ డాడీ  నీ వయసులో ఉన్నప్పుడు నేను వాడిని తిట్టిన తిట్లు ఇప్పుడు నిన్ను అంటున్నాడు. రేపు నువ్వూ అలాగే అంటావు. తరాలు మారతాయి మాటలు అవే" అన్నాడు రాజారావు నవ్వుతూ.
"అంటే? ఏమంటున్నారు తాతయ్యా?"...
"అది నీకు అర్థం కావాలి అంటే నువ్వు మీ నాన్నంత అవ్వాలి " మళ్ళీ నవ్వుతూ అన్నాడు రాజారావు.

కామెంట్‌లు