ఆట వెలదులు
కన్నవారి నైన వెన్నుపోటు బొడవ
నారితేరినారు నధికజనులు
నమ్మినట్టి వారి నగుబాటు జేయగ
మనసులెట్లు గలుగు మానవులకు !!
సొమ్ముదినియు గూడ సోకుదీర గులికి
ఏమి బెట్టితివని యెత్తిపొడుచు
తిన్నవాడు మరువ కన్నయ్య మరుచునా
దుష్టబుద్ధి నిట్లు దులపవలయు !!
మొహము చాటువేయు మూతిముడుచుకొంటు
సాయమడుగగాను సద్దులేక
చేసినట్టి మేలు చెరుపరానిదిగాదె
బంధువర్గమునను బంధమిటుల!!
ఏళ్ళకేళ్లు నొకరి నె ట్లువాడుకొనిన
వెన్నుపోటు బొడుచు వెధవపనులు
చేయరాదు ఫలము చివరకు తనకౌను
కలియుగమ్మునందు కలుగునిదియె !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి