షడ్రుచులలో లేని
ఓ మధురాతి మధురం
పసిపిల్లల
అందమైన నవ్వులో
పొందవచ్చు
===============
కొన్ని విషయాలు
తేలికేలే అనుకుంటాం
కానీ
అటువంటివే చేజారిపోయి
అయోమయంలో పడుతుంటాం
అప్పుడప్పుడూ
మన జీవితపయనంలో...
==============
కచ్చితంగా
ఏదో ఒక రోజు
మనకే
ఆ అవస్థా
బాధా తప్పవనే
నిజాన్ని గ్రహించగలిగితే
ఎవరినీ
గాయపరచాలనే ఆలోచనే
మనసులో పుట్టదు
=================
హక్కుందనుకుని
మాట్లాడే మాటలకన్నా
నమ్మకంతో
మాట్లాడే మాటలకు
బలమెక్కువ
==============
ప్రేమను
పాలించాలనుకునేవారనేకులు
పాలించడం తెలీక
బోర్లా పడేవాళ్ళు కొందరు
అనుగ్రహం పొందినవారికి
ప్రేమ సింహాసనమౌతోంది
అనుగ్రహం లేనివారికి
ప్రేమ సాలీడువలౌతోంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి