గురుదేవులు;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
జ్ఞాన రూపము గురువు
కామధేనువు గురువు
చూపు చక్కని తెరువు
ఓ వెన్నెలమ్మ

పూజనీయులు మహిని
కొలువు వారిని మదిని
గురువు దీవెనల గని
ఓ వెన్నెలమ్మ

గురువు ఉంటే మేలు
వారి సన్నిధి చాలు
బ్రతుకులో పదివేలు
ఓ వెన్నెలమ్మ

ఉదయ భానుడు గురువు
మెదడుకతడే ఎరువు
భువిని పచ్చని తరువు
ఓ వెన్నెలమ్మ

దైవ  రూపము గురువు
వెలుగు దీపము గురువు
నిలుపు గురువుల పరువు
ఓ వెన్నెలమ్మ

లేరు గురువుకు సాటి
వారు ధరలో మేటి
నమస్సులు శతకోటి
ఓ వెన్నెలమ్మ


కామెంట్‌లు