శక్తిసామర్ధ్యాలు చూపరా;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పలుకురా పలుకురా
తియ్యగా పలుకురా
ప్రక్కనున్నవారిపై
ప్రభావంబు చూపరా

తియ్యరా తియ్యరా
వెలికి తియ్యరా
నీశక్తిని బయటకుతియ్యరా
నలుగురికి నేర్పరా

వాడరా వాడరా
మేధస్సును వాడరా
మంచిపనులు చేయరా
మున్ముందుకు సాగరా

చూపరా చూపరా
నేర్పరితనం చూపరా
నీలోన నిలచియున్న
నిగూఢశక్తిని చాటరా

చెయ్యరా చెయ్యరా
సంఘసేవ చెయ్యరా
శక్తిమేర యుక్తిపన్ని
సమాజవృధ్ధి చెయ్యరా

బ్రతకరా బ్రతకరా
నీతిగా బ్రతకరా
నిజాయితీని నిలుపురా
నిండునూరేళ్ళు బ్రతకరా

ఊహలను ఊరించరా
మనసును మదించరా
భావాలను బయటపెట్టరా
కమ్మనికవితలు వ్రాయరా

తెలుపరా తెలుపరా
తెలుగుతీపిని తెలుపురా
తల్లితెలుగు ఘనతను
దశదిశల చాటరా


కామెంట్‌లు