జ్ఞాన శిఖరాలు ; - ఎం. వి. ఉమాదేవి
నీమనసు తోడుగా 
నిలిచి సాగాలి 
చైతన్య భావనలు 
చిగురు తొడగాలి !!

మాయ జలతారులే 
తొలగి నడవాలి 
మంగళపు తోరణంగా 
మనిషి కావాలి !!

మాటలే  సత్తువకి 
మూల మవ్వాలి 
బాటలో దయపూలు 
పరచుకోవాలి !

చేయూత నివ్వగా 
ఎదిగి ఒదగాలీ 
చేయందుకొని నీవు 
చరితలో నిలవాలి!!

స్వార్ధమౌ బుద్ధులకు 
ఎడము కావాలి 
వ్యర్థమగు ఊహలను 
పార ద్రోలాలి !


ముత్యాలు రత్నాలు 
కవిత లవ్వాలి 
మురిపించు అక్షరం 
అభయమీయాలి !!


ఒక్కొక్క అడుగుతో 
విజయమందాలి 
జ్ఞానశిఖరాలనే 
అందుకోవాలి !!

కామెంట్‌లు