మిత్రుడు ;- పెందోట వెంకటేశ్వర్లు--సిద్దిపేట
సూర్యుడు రోజు వస్తాడు 
వేడి వెలుతురు తెస్తాడు
 చెట్లకు ఆహారము అవుతాడు
మబ్బుకు  ప్రాణం పోస్తాడు

 తూర్పు నుండి పడమర 
 ఆగక పరుగే తీస్తాడు 
అలుపు సొలుపు లేదసలే
మిత్రుడిలా చెంత చేరును 

ఆట, పాట ,  చదువుతో
 సూర్యుని లాగా సాగాలి 
ప్రతిభను ఎంతో చూపాలి
విజయాలనే పొందాలి.
 


కామెంట్‌లు