మంచి మాటలు(బాల గేయము)-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
చెప్పుడు మాటలు వినకు
చేటు నీకు జరుగును
తప్పుడు పనులు చేయకు
తిప్పలు నీకు తప్పదు

అబద్దాలు చెప్పకు
ఆడిన మాట తప్పకు
అంటుడు మాటలు చెప్పకు
ఇంటికి చేటు జరుగును

కండ్లతోటి చూసి నీవు
కాళ్లతోటి లేపబోకు
వంకర మాటలు చెప్పకు
తింగరి పనులు చేయకు

కపట గుణము మానుకో
కరుణ తోడ మసులుకో
గోడ దూకి వెడలకు
అడ్డ దారి నడవకు

పిల్లి వలె ఉండకు
నక్క నడక నడవకు
సింహం వలె ఉండు
గర్వంగ బ్రతుకు నీవు


కామెంట్‌లు