ఉందీ!! లేదు!!;-(ఓషో చెప్పిన కథ ఇది!)--- యామిజాల జగదీశ్
 ఈ కథ ఆస్తికుడినీ, నాస్తికుడినీ ఒక దెబ్బతో పడగొట్టే ఆయుధంగా అనుకోవచ్చు.
ఇంతకూ కథ ఇదే....
మీరు ఏది నిజమో చెప్పాలి!
ఒక వ్యక్తి ఓ గ్లాసులో సగం దాకా నీరు పోసి ఒకడిని అడిగాడు...
"నువ్విందులో ఏం చూస్తున్నావు" అని.
అతను చెప్పాడిలా 
"గ్లాసులో సగం వరకూ నీరు లేదు" అని.
మరొకరికీ అదే గ్లాసుని చూపిస్తూ "నువ్వేం చూసావిందులో?" అని అడిగాడు ఆ వ్యక్తి.
ఆ మనిషేం చేప్పాడంటే "గ్లాసులో సగం వరకూ నీరుంది" అని.
ఇద్దరి జవాబులూ నిజమే. ఒక్కటే.
ఉంది, లేదు ఆనేదే ఇప్పుడు సమస్యగా మారింది.
అవును, మీరు ఓ నాస్తికుడిగా ఉండి "దేవుడు లేడు అని చెప్పడం ఎంతో సరైనదో  ఆస్తికుడై ఉండి "దేవుడు ఉన్నాడు" అనడమూ అంతే సరైంది.
కానీ పరిపూర్ణతకు దాని గురించి ఎటువంటి ఆసక్తీ లేదు. ఆందోళన అంతకన్నా ఉండదు.
ఉందీ అన్నదీ లేదూ అన్నదీ మీ మనసుకి సంబంధించిన సమస్య.
అవును, 
మనం మన ఉందీ, లేదూ అనే రెండు స్థితులనూ దాటనంతవరకూ నిజాన్ని తెలుసుకోలేము. 
నిజం నిజంలాగానే ఉంటుంది. ఆ నిజంతో మమేకం కావాలంటే నువ్వూ నిజమై మారిపోవాలి!

కామెంట్‌లు