ఎంత ఘోరం!;-సుమ కైకాల
 పొద్దున్నుండి అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు చిదంబరం.
"కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నారు ఏమైందoడి?"... రాణి అడిగింది.
"చాలా ఘోరం జరిగిపోయింది" తల పట్టుకొని ఇంకా స్పీడ్ గా తిరుగుతున్నాడు.
" అయ్యో! ఏం జరిగిందoడి ? పడి పోతారేమో నండి. కాస్త ఆగి చెబుదురూ..."
"నన్ను మా ఆఫీస్ వాట్సప్ గ్రూప్ నుండి రిమూవ్ చేసేసారు" ఉక్రోషంగా అన్నాడు.
"అమ్మయ్యా!  చేసేసారూ? ఎందుకు చెయ్యరు? లేచిన నుండి పడుకునే దాకా మీకు వచ్చిన ఇమేజెస్ అన్నీ అందరికీ పంపుతూ ఉంటే ఎవరూరుకుంటారు?" ఆనందంగా అంది.
ఏమీ చేయలేక మరింత స్పీడ్ గా తిరుగుతూ" చూస్తూ ఉండు ఏదో ఒక రోజు నా విలువ నీకు, వాళ్ళకి తెలిసి వస్తుంది" అన్నాడు చిదంబరం.

కామెంట్‌లు