మనిషి వెనక్కి వెళ్తే!!?;-ప్రతాప్ కౌటిళ్యా
 జీవ నిర్మాణం జరుగుతున్నప్పుడు, జీవ పరిణామం జరుగుతున్నప్పుడు, మనీషీ ఎక్కడున్నాడు? భవిష్యత్తులో ఉన్నాడు.
ఒక్కసారి మనిషి వెనక్కి వెళ్ళగలడా? వెళ్ళ గలడు.మన ముందే సాక్షాదారాలు ఉన్నాయి. ఆ సమయం ముఖ్యం కాదు. ఆ నిర్మాణం ఆ పరిణామం ముఖ్యం. ఒక ఆధారమైన నా చక్కని ఉదాహరణలు చాలు. మనిషి వెనక్కి వెళ్తే అణువులు పరమాణువులు కాదు నిర్మాణం పరిణామం ముఖ్యం.

కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ ఆధారంగా జీవుల వర్గీకరణను పరిణామ క్రమాన్ని విభజించి వివరించినారు. దాని ప్రకారం ఇప్పుడు ఉన్న మనిషి వారసులు ఎవరు, ఆ జీవి చరిత్రలో పూర్వికులు ఎవరో తెలుసుకుంటే మనిషి ఒక్కో మెట్టు కిందికి దిగి దిగి వస్తే వర్గం వర్గీకరణ ప్రకారం, హోమో సేపియన్స్ నుంచి కిందికి దిగుతూ పోతే ఉదాహరణలతో మనకు పరిచయం ఉన్న శాస్త్రీయ జీవులు ఒక్కొక్కటి పరిచయమవుతాయి. మనిషికి ముందు ఏం జరిగింది. కణము, కణ నిర్మాణము, అవయవ నిర్మాణము, అవయవ వ్యవస్థ ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. అంటే వర్గీకరణలో జీవ నిర్మాణం, జీవ పరిణామం లో మనిషి ఒక భవిష్యత్తు జీవి గానే ఉన్నాడు. ఇప్పుడు వర్తమానంలో ఉన్న మనిషి గతంలోకి వెళ్తే ఎలా ఉంటాడో తెలుసుకునేందుకు చేసే చిన్న ప్రయత్నం ఇది. ఇది జన్యుపరంగా, శరీర ధర్మ శాస్త్రం అనాటమీ, జీవరసాయన, మాలిక్యులర్ బయాలజీ ప్రకారం గా కూడా నిరూపించబడింది. శాస్త్రం అంగీకరించిన జీవ పరిణామం జీవనిర్మాణం ప్రకారం మనిషి వెనక్కి వెళ్లే క్రమమే ఈ వ్యాస ఉద్దేశం ఒక్కసారి పైనుంచి కిందికి దిగుతూ వెళ్లి మనిషి చరిత్రను ఊహించండి.

భూమి పుట్టినప్పటినుంచి 350 కోట్ల సంవత్సరాల క్రితం లూకాన్ అనే జీవి ప్రపంచమంతటికి పూర్విజీవిగా చెప్పుకుంటారు. జీవ పరిణామం ఎలా జరిగిందో ఇది వివరిస్తుంది. 750 లక్షల సంవత్సరాల నుంచి చింపాంజీ జీవిస్తుంది. మనిషి 60 లక్షల సంవత్సరాల నుంచి భూమిపై జీవిస్తున్నాడు.
 మనిషి ఒక్కసారి మనిషిగా పుట్టలేదు
ఏకకణం నుంచి బహుకణం, బహుకణం నుంచి జీవం, జీవం నుంచి జీవులు, జీవుల నుంచి జంతువులు, జంతువుల నుంచి మనిషిగా క్రమక్రమంగా పరిణామం చెంది జీవనిర్మానం జెన్యుపరంగా జరిగి హోమోసెఫియన్స్ గా చివరకు మనిషిగా పుట్టాడు. అంతకు పూర్వం మనిషి ఎన్నో అవతారాలు ఎత్తి, ప్రతి అవతారంలో ఒక జీవిగా ఎదిగి, కణము, కణజాలము, అవయవము, అవయవ వ్యవస్థ ఏర్పడి చివరకు మనిషిగా ఎదిగి, మెదడు రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఒక్కొక్కటి ఉన్నతంగా ఏర్పడిందని మనకు తెలుస్తుంది. అంతకు పూర్వం మనిషి అవతారాల గురించి తెలుసుకుందాం.

జీవ వర్గీకరణ లో మనిషి వెనక్కి వెళ్తూ పోతే మొదట పాలిచ్చే జంతువులు మొదటి స్థానంలో ఉన్న జంతువు చింపాంజీ లేదా ఒరాంగ్ హుటాన్ అనే చింపాంజీ మనిషి నిలుస్తాడు. చింపాంజీ కన్నా ముందు ఏవ్స్ లో మనిషి పక్షిగా డేగ కోడి లేదా నెమలిగా బ్రతికి నట్లు తెలుస్తుంది. దానికన్నా ముందు రెఫ్టైల్స్ వర్గంలో డైనోసార్స్ గా పాములుగా అనకొండ, తొండలుగా బ్రతికినట్లు గుర్తించారు. ఇంకా దీని తర్వాత కిందికి వెళ్తే ఉభయచరాల్లో కప్పగా మనిషి బ్రతికినట్లు ఊహించవచ్చు. కప్ప కన్నా ముందు మనిషి చేపలు గా, లంగ్ ఫిషెస్ ఉభయచరాలు గా మనిషి సకశేరుక జీవులుగా బ్రతికిన ఉన్నట్లు శాస్త్రం పరిగణిస్తుంది.
ఆ తర్వాత ఆకశేరుకాలైన ఎకైనోడేర్మటా వర్గంలో స్టార్ ఫిష్ గా బ్రతికి దానికన్నా కిందికి వెళ్తే మొలస్కావర్గంలో ఆల్చిప్పలు నత్తలు ఆక్టోపస్ శంకముగవలుగా మనిషి బ్రతికినట్లు మనం చెప్పుకుంటున్నాం. వీటికన్నా క్రింద ఆర్తో ఫోడ్ జీవులైన బొద్దింక ఈగలు దోమలుగా మనిషి బ్రతికినట్లు ఆధారాలు ఉన్నాయి.
దీనికన్నా కిందికి వెళితే అనెలిడ జీవి వానపాముగా మనిషి మనకు కనిపిస్తాడు. ఇంకా కిందికి వెళ్తే నిమాటీహెల్మీంథిస్ లో నులిపురుగుగా బ్రతికినట్లు మనిషి మనకు కనిపిస్తాడు. దానికన్నా ఇంకా కిందికి వెళ్తే ప్లాటిహెల్మీంథిస్ లో బద్దె పురుగు గా బ్రతికినట్లు తెలుస్తుంది.
దీనికన్నా కిందివర్గం సిలింటీరెటాకెళ్తే హైడ్రాగా మనిషి బ్రతికినట్లు మనం ఊహించుకోవచ్చు. ఇంకా కిందికి దిగితే పోరిఫెరావర్గంలో స్పాంజ్ గా సముద్రంలో మనిషి బ్రతికినట్లు మనం గుర్తించవచ్చు. దీనికన్నా ముందు ప్రోటోజోవా వర్గంలో ఏకకణ జీవులైన అమీబా పారమీసియంగా మనిషి ప్రారంభమైనట్లు శాస్త్రీయ ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి.
అంటే మనిషి పూర్వం అమీబా నుంచి ప్రారంభమై భవిష్యత్తులో మనిషిగా పుట్టాడన్న వాస్తవాన్ని జీవ పరిణామ జీవ నిర్మాణ శాస్త్రం మనకు తెలియజేస్తుంది.
భవిష్యత్తులో భూమిపై ఎవరుంటారు. మనిషి ఉంటాడ, మరేదైనా భవిష్యత్తు జీవి ఏది. మనకి ఇంకా తెలియదు.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు