సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 పొదుపు.... మదుపు...
   *******
పొదుపు, మదుపు ఈ రెండూ  సుఖమయ జీవితానికి బాటలు వేసుకోవడానికి చేసే మంచి పనులు.
మనం సంపాదించే డబ్బు కానీ, మన అవసరాలకు ఉపయోగించే వివిధ వనరులు, వస్తువులు కానీ అనవసరంగా వృధా చేయకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి వినియోగించడాన్నే పొదుపు అనవచ్చు.
మనం చేసే పొదుపే జీవితాన్ని  మలుపు తిప్పుతుందని మరవొద్దు.
పొదుపుతో  కొంత మదుపు చేయడం కూడా ముఖ్యమే. 
మదుపు అంటే  దీర్ఘకాలిక అవసరాలకు అంతో ఇంతో ఆదాయం పెరగడానికి , అవసరాలు తీరడానికి చేసే పొదుపే మదుపు.
జీవితం ఎన్నో అవసరాలు ఆర్థిక సంబంధమైన విషయాలతో ముడిపడి ఉంటుంది. 
 స్వంత ఇల్లు, పిల్లల చదువులు,ఉన్నత విద్య సమాజంలో ఆర్థిక హోదాకు సంబంధించిన కలలు ఎన్నో కంటుంటాం.అవి సాకారం చేసుకోవడానికి చేసేదే మదుపు.
 
ఈ రెండూ బాగా తెలిసిన వారు మాత్రమే అవసరమైన చోట ఆనందంగా ఖర్చు పెడుతూ,  పొదుపును, మదుపును అమలు పరుస్తూ తాము అనుకున్న స్థాయిలో ఉంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు